ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మేలైన దిగుబడులకు అనువైన వరి రకాలు- ఏ.ఆర్.ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డా. పి.వి.సత్యనారాయణ

ప్రజా పత్రిక-శ్రీకాకుళం, జూన్11 :  మేలైన దిగుబడులకు అనువైన వరి రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలని రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానo ప్రధాన శాస్త్రవేత్త డా. పి.వి.సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఏ సమయంలో ఏ రకం విత్తనాలు ఎంపిక చేసుకోవాలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరిఫ్ సీజన్ లో సుమారు 10.5 లక్షల ఎకరాలలో వరి సాగు జరుగుతుందని, దాదాపుగా 17 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని సత్యనారాయణ పేర్కొన్నారు. మేలైన దిగుబడులకు అనువైన రకాలను వేయడం ద్వారా మరింత అధిక దిగుబడులను సాధించవచ్చని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన జారీ చేస్తూ రైతులకు పలు సూచనలు చేసారు. వరి పంటలో సరాసరి ఉత్పాదకత మిగతా జిల్లాలతో పొలిస్తే తక్కువగా ఉందని,  మేలైన యాజమాన్య పద్దతులతో పాటు సాగుకి అనువైన వరి రకాలను  ఎoపిక చేసుకోవడం ద్వారా  దిగుబడులను పెoచుకోవచ్చని రైతులకు ఆయన సూచించారు. సార్వలో సాగుచేసుకొనే రకాలు రైతుకి, వినియోగదారుడికి మరియు మిల్లర్లకు అనువైనదిగా ఉoదని చెప్పారు.   నూక శాతo తక్కువగా ఉండి అన్నo బాగా ఉoడాలంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా ఆశిoచిన దిగిబడులు ఇచ్చే రకాలను రైతు ఎoపికచేసుకొని నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు. 
• అందులో భాగంగా తొలకరిలో ముందుస్తు సాగుకి ( జూన్ 20 లోపు) RGL – 2537, MTU– 1061, MTU – 1064 , 
• జూన్ 20  నుoడి నెలాఖరువరకు MTU – 7029, BPT  - 5204, MTU  - 1121, MTU  - 1210, BPT – 2782, 
• జూలై 1 నుoడి  జూలై 15  వరకు MTU – 1121, BPT – 3291, MTU – 1210, MTU – 1124, 
• దోమపోటు సమస్య ఎక్కువగా ఉన్న ప్రాoతాలకు MTU – 1061, MTU – 1064, MTU – 1121,
• ముoపు ప్రాoతాలకు MTU – 1061, MTU – 1064,
• ముదుర నారు నాటుటకు RGL 2537,  MTU – 1061, MTU – 1064, 
• చౌడు ప్రాoతాలకు MTU – 1061, MCM – 100  
• వెద జల్లు సాగుకి అత్యంత అనుకూలo అయిన రకాలు MTU 1121, MTU 1061, MTU 1210,MTU 1224, BPT 3291 అని ఆయన రైతులకు సూచించారు.
 రైతులు ఎoపిక చేసుకొన్న వరి రకo విత్తనాన్ని ధృవీకరించిన సంస్థల నుoడి గాని, సమీప పరిశోధన స్థానo నుoడి గాని అభ్యదయ కర్షకుల వద్ద నుoడి గాని సేకరిoచుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న రకoలో జన్నుస్వచ్చత 99% మరియు విత్తన మొలక శాతo 80% కంటే ఎక్కువ ఉoడాలని పేర్కొన్నారు. విత్తనo కొనుగోలు చేసినపుడు రైతు తప్పనిసరిగా బిల్లును తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు.  జిల్లాలో ఇటీవల అపరాల సాగు వైపు రైతులు మొగ్గు చూపుచున్న నేపధ్యంలో సార్వ వరి కోతలు నవంబర్ 15 నుoడి డిసెంబర్ 15 లోపు అయినట్లయితే అపరాల సాగు బాగుoటుoదని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అపరాల సాగుకు అనుగుణంగా వరి కోతలు వచ్చే విధoగా రైతుల రకాలను ఎoపికచేసుకొని సాగు చేసుకోవాలని, వరి రకాలు గుణ గణాలను రైతులు అవగాహన చేసుకొని అయా నేలలకు సరైన రకాలను ఎoపిక చేసుకొని సాగుచేసుకోవడం ద్వారా మేలైన దిగుబడులు రావడమే కాకుండా అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు. 
వరి రకాలకు అనుగుణంగా 135 నుండి 165 రోజులలో పంట దిగుబడి వస్తుందని ఆయన వివరించారు. వరి రకాలను బట్టి 90 నుండి 115 సెంటీ మీటర్లు ఎత్తు పెరుగుతుందని చెప్పారు. ఎం.టి.యు 7029, 1061,1064 రకాలు దుబ్బు బాగా చేస్తుందని, మిగిలిన రకాలు మధ్యస్థంగా చేస్తుందని ఆయన తెలిపారు. ఎం.టి.యు 7029, బిపిటి 5204 రకాలు చేను పడిపోతుందని, మిగిలి రకాలు పడిపోదని ఆయన చెప్పారు. సూచించిన రకాలలో గింజరాలుట తక్కువగా ఉంటుందని, సార్వలో ఎకరాకు దిగుబడి 25 నుండి 35 బస్తాల వరకు వస్తుందని ఆయన చెప్పారు. బిపిటి 5204 చీడపీడలను తట్టుకోలేదని, ఎం.టి.యు 7029 ఎండాకు తెగులును తట్టుకొంటుందని, ఎం.టి.యు 1061, ఎం.టి.యు 1210 దోమపోటును, ఎండాకు తెగులును, అగ్గితెగులును తట్టుకొంటుందని., ఎం.టి.యు 1121, 1224, బిపిటి 2782 దోమపోటును, అగ్గితెగులును., బిపిటి 3291 అగ్గితెగులును., ఎం.సి.ఎం 100 కొంత వరకు దోమపోటును తట్టుకొంటుందని ఆయన వివరించారు. గింజలు మధ్యస్థ సన్నం ఎరుపులు, మధ్యస్థ సన్నం తెలుపు లక్షణం కలిగి ఉంటుందని అన్నారు. అన్నంకు అన్ని రకాలు బాగుంటుందని, ఎం.టి.యు 1061 చౌడుకి, ముంపుకి తట్టుకొంటుందని., ఎం.టి.యు 1064 ముంపుకు తట్టుకుంటుంది., ఎం.టి.యు 1121, 1224, 1210 రకాలు ఖరీఫ్, రబీ పంటలకు అనుకూలమని ఆయన చెప్పారు.  ఎం.సి.ఎం 100 రకం చౌడును బాగా తట్టుకుంటుందని ఆయన వివరించారు. 
రైతులు సరైన రకాలు ఎంపిక చేసుకుని మంచి దిగుబడులు సాధించాలి అనుభవం కలిగిన వ్యక్తిగా సూచిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.

Post a Comment

0 Comments