శ్రీకాకుళం, జూన్ 13 : శ్రీకాకుళం జిల్లా గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్ గా హిమాంశు కౌశిక్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. హిమాంశు కౌశిక్ 2018 బాచ్ ఐ.ఏ.ఎస్ అధికారి. గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్ గా చేరిన కౌశిక్ అమలాపురం సబ్ కలెక్టర్ గా చేస్తూ బదిలీపై గృహ నిర్మాణం జాయింట్ కలెక్టర్ గా వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో సహాయ కలెక్టర్ గా శిక్షణ పొందారు. జిల్లాలో గృహ నిర్మాణం వేగవంతం కావడానికి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జగనన్న కాలనీలలో అన్ని సౌకర్యాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వివిధ పథకాల క్రింద మంజూరైన ఇళ్ల నిర్మాణంతో సహా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయుటకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
0 Comments