శ్రీకాకుళం, జూలై, 29:వివిధ ప్రభుత్వ శాఖల అనుసంధానానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ డిఆర్డిఎ పిడి ని ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు వ్యవసాయం దాని అనుబంధ శాఖలు, తదితర వాటిని శిక్షణా సంస్థ పరిధిలోకి తీసుకురావాలని పిడిని ఆదేశించారు. కోవిడ్ ఉన్నందు వలన ప్రస్తుతం శిక్షణ నిర్వహించడం లేదని, అనుమతి మంజూరు చేస్తే శిక్షణ తిరిగి ప్రారంభిస్తామని శిక్షణా సంస్థ సంచాలకులు కె. శ్రీనివాస్ తెలిపారు. అనంతరం శిక్షణా సంస్థ వార్షిక లక్ష్యాల పుస్తకంను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ పిఓ సిహెచ్. శ్రీధర్, డిఆర్డిఎ పిడి బి. శాంతి శ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరి ప్రసాద్, డిడి ఎం మిలింద్ చౌసల్కర్, ఇండస్ట్రీస్ డిఎం బి గోపాలకృష్ణ, ఎపిఎంఐపి పిడి జమదగ్ని
నైరెడ్ శిక్షణ సంస్థ సంచాలకులు కె. తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments