ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యార్థులను మోసం చేస్తూ... విద్యా దీవెన ఏమిటి...

*విద్యార్థులను మోసం చేస్తూ... విద్యా  దీవెన ఏమిటి...*

 *నాడు 16 లక్షల మందికి... నేడు 10 లక్షల మందికేనా*

 *ఉన్న పథకాలను రద్దు చేయడం దారుణం*

కొత్తపేట.. జగనన్న విద్యా దీవెన అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులను మోసం చేస్తున్నారని అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అన్నారు. కొత్తపేట లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో విద్యార్థులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్యను అందించే విద్యా నిధి పథకాన్ని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారన్నారు. చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించిందని, జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10 లక్షల 97 వేల మందికి కుదించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దూరంచేసి వారి భవిష్యత్తును నాశనం చేశారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తూ జీవో నెంబర్ 77 ను విడుదల చేసి వారిని విద్యా దీవెన పథకం నుంచి తప్పించారని చెప్పారు. అటు బాలికలకు సైకిళ్లు పంపిణీ, మెస్, కాస్మోటిక్ ఛార్జీలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేయడం దారుణమన్నారు. కోవిడ్ కారణంగా దాదాపు 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అటు ప్రైవేటు స్కూలు టీచర్లు ఉపాధి లేక విలవిలలాడుతున్నా వారి వైపు జగన్రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదు అన్నారు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు 2 డీఎస్సీ లు నిర్వహించి 16 వేల కు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం ఏడాదికి ఒక డిఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించ లేదన్నారు. ఇటీవల ఆర్భాటంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఒక్క డీఎస్సీ పోస్ట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

Post a Comment

0 Comments