ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అయ్యా జగన్ మోహన్ రెడ్డి ఇదేనా ప్రజాలవద్దకు సేవలు ....? "కత్తిరి"

ఐదేళ్ల వయసు దాటిన వారికి ఈ-కేవైసీ చేస్తేనే రేషన్‌ ఆధార్‌ కేంద్రాలకు పిల్లలతో తల్లిదండ్రుల పరుగులు పరిసర గ్రామాల నుంచి ప్రజలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చి అవస్థలు పడుతూ ఇలా నిలుచున్నారు.గతంలో మీ సేవా కేంద్రాల్లో ఆధార్‌ మార్పులకు అవకాశముండేది. కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతో కొన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు మాత్రమే ఆ అధికారం ఇచ్చారు. జిల్లాలో 65 బ్యాంకుశాఖలు,9పోస్టాఫీసుల్లలో , కొన్ని మండల  మీ సేవా  కేంద్రాల్లో ఆధార్‌ అప్‌డేషన్లు జరుగుతున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 20 మందికి మించి చేయలేని దుస్థితి. జిల్లాలో లక్షల మందికి అప్‌డేషన్లు చేసుకునేందుకు నెలాఖరు వరకే సమయం ఉందని చెబుతున్న అధికారులు ఈ కేంద్రాలతో ఎలా సాధ్యమవుతుందనే ఆలోచించడం లేదని విమర్శిస్తున్నారు. జిల్లాలో ఆధార్‌ కేంద్రాలెన్ని? ఒక్కొక్కరికీ ఎంత సమయం పడుతుంది? రోజుకు ఎంతమందికి మార్పులు చేయొచ్చు? రద్దీ నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 20వ తేదీ లోగా ఐదేళ్ల వయసు పైబడిన చిన్నారులకు ఈ-కేవైసీ చేయకపోతే వచ్చేనెల రేషన్‌ సరకులు నిలిచిపోతాయనే ప్రకటనలతో అంతా ఆధార్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గత వారం రోజులుగా తెల్లవారు నుంచి సాయంత్రం వరకూ భారీ క్యూలే దర్శనమిస్తున్నాయి. ఉన్న కేంద్రాలు తక్కువ, ఆధార్‌ అప్‌డేషన్‌ చేయించుకోవాల్సిన వారి సంఖ్య లక్షల్లో.. ఫలితంగా వచ్చిన వారి పని పూర్తికాక రోజుల తరబడి అవస్థలు పడుతున్నారు.బియ్యం కార్డులో పేరుండి ఈకేవైసీ పూర్తికాని వారు జిల్లాలో 4,03,569 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకూ 81,108 మందికి పూర్తయింది. ఇంకా 3,22,461 మంది మిగిలారు. వీరిలో అధికశాతం పిల్లలే ఉన్నట్లు అధికార వర్గాల మాట. అందరికీ ఈనెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. దాని ప్రకారమే లబ్ధిదారులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. బోగస్‌, ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు, మృతుల పేరు మీద రేషన్‌ తీసుకుంటున్న వారిని గుర్తించి వాటన్నిటినీ తొలగించేందుకే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఈకెవైసి ని  గ్రామాల్లో వున్నా వాలంటీర్స్ టాబ్స్ ,డీలర్ దగ్గర వున్నా మెషీన్ మరియు గ్రామసచివాలయం లో  చేయటానికి వీలుకల్పించే ఉత్తర్వులు జారీ చేసి ప్రజలకు మెరుగైన సేవలుకు కృషి చేయాలని  ప్రభుత్వపెద్దలకు మరియు ప్రభుత్వాధికారులకు సారవకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కత్తిరి.వెంకటరమణ డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments