శ్రీకాకుళం,ఆగస్ట్ 16.సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తం ఉండాలిని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి సంతకవిటి, శ్రీకాకుళం ఒకటివ పట్టణ పోలీసు స్టేషన్ నందు నమోదు కాబిడిన సైబర్ నేరాలు గురించి వివరాలు వెల్లడించారు.
వివరాలులోకి వెళితే...
తే 01.07.2021ది సుమారు 13.00 గంటలకు బంకుపల్లి శ్రీనివాసరావు పోనుగుతటివలసా పంచాయితి, సంతకవిటి మండలం అను అసామికి
తన బియెస్ఎన్ఎల్ 9440197127 కు 13.00 గంటల సమయంలో తెలియని 9861556783 నుండి టెక్స్ట్ సందేశాన్ని పొందింది, అందులో "మీ సిమ్మ్ కార్డు పత్రాల ధృవీకరణ పెండింగ్లో ఉంది, దయచేసి మీరు ధృవీకరణ పొందకపోతే, మీ సేవలు 24 గంటల్లో బ్లాక్ చేయబడుతుందినీ అపరిచిత వ్యక్తుల నుంచి లింక్ను పంపించడం జరిగింది.ఫిర్యాదుదారుడు ఆ లింకుని తెరిచిన త మరియు అతని డెబిట్ కార్డు నుండి Rs.10/-రీఛార్జ్ చేసినప్పుడు అతని ఖాతా అతనికీ తెలియకుండానే 47,400 డెబిట్ చెయ్యబడింది. అనంతరం
02-07-2021 న 11.00 గంటలకు సంతకవిటి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందినీ, ఇదే విధమైన మోసానికి సంబంధించి, 62,500/- మోసం జరిగినదని శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసు స్టేషన్ నందు మరొక పిర్యాదు నమోదు అయిందని ఎస్పీ తెలిపారు. పై కేసులలో ఇద్దరు నిందుతులని అరెస్టు చేసి, ఎం.ఐ,వివో ఆండ్రాయిడ్ ఫోన్లు, జియావో కీ పాడ్ ఫోన్
నీ స్వాధీన పరచుకునన్నారు. సైబర్ మోసాలు జరిగినపుడు, నేరస్తులను గుర్తించడంలో మొదటి గంట చాలా కీలకమని, సైబర్ మోసానికి గురైన వ్యక్తులు నేరం జరిగిన తక్షణమే ఆలస్యం చేయకుండా సంబంధిత బ్యాంకు లేదా ఇతర కార్యాలయాలు మరియు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా భాదితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని అని జిల్లా ఎస్పీకి కోరారు.సైబర్ నేరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం గత నెలలో అవగాహన చేయడం ద్వారా జిల్లాలో కొంతమేరకు సైబర్ నేరాలు అరికట్టడం జరిగిందని ఎస్పీ గారు ఈ సందర్భంగా తెలియజేశారు. సైబర్ నేరాల పరిశోధనలో ప్రతి ఆధారం, సమయం చాలా కీలకమని, పోలీసులు ఇన్ టైంలో ఆధారాలను కలెక్ట్ చేసి నిందితులను పెట్టుకున్నారని కొనియాడారు. సైబర్ బృందం ఆరు నెలలుగా సైబర్ నేరాలపై తర్ఫీదు పొంది కేసులు చేయించడంలో లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని జిల్లా ఎస్పీ కొనియాడారు. రానున్న కాలంలో సైబర్ సెల్ విభాగాన్ని మరింత పటిష్టం చేసి జిల్లాలో సైబర్ నేరాలు నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
పై నేరాల్లో క్రియాశలకంగా వ్యవరించి నేరస్తలను చేదించడంలో మంచి ప్రతిభ కనబరిచి రాజాం గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.నవీన్ కుమార్, సంతకవిటి యస్.ఐ ఆర్. జనార్ధనరావు, హెడ్ కానిస్టేబుల్ జి.రాంబాబు,హెడ్ కానిస్టేబుల్ కె. టీటీరాజు,సైబర్ క్రైమ్ సెల్ శ్రీకాకుళం,పోలీసు కానిస్టేబుల్
వై రామరాజు, హెడ్ కానిస్టేబుల్లు ఎం. శ్రీధర్ కుమార్, సి.హెచ్.వి.సత్యం అను వారికి అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో యస్.బి, డిఎస్పీ ఎం వీర కుమార్,పాలకొండ డిఎస్పీ ఎం శ్రావణి, రాజాం గ్రామీణ సీఐ డి. నవీన్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.
0 Comments