శ్రీకాకుళం:సిపిఎస్ విధానంపై ప్రభుత్వ వైఖరిని అవలంబించే విధానాలపై క్షుణ్ణంగా తెలుపుతూ "పెన్షన్ బిక్ష కాదు-ఉద్యోగుల హక్కు" అనే పేరుతో ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. దీన్ని శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోం ఎన్జీవో నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు హనుమంతు సాయిరాం చేతుల మీదుగా విడుదల చేశారు. సిపిఎస్ విధానం అమలులో తలకిందులైన ఉద్యోగుల జీవితాలను కళ్లకు కట్టేలా దర్శకులు బాలకృష్ణ ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులపై ఎందుకు మొండివైఖరి గా అవలంభిస్తోందని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. సిపిఎస్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిచో రాష్ట్ర స్థాయి ఉద్యమము చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో ఉన్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై.. CPS కష్టనష్టాలను వివరించే మొదటి లఘు చిత్రం ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం నుండే రావడం నిజంగా గర్వంగా ఉందని అన్నారు..
ఈ లఘు చిత్రం ప్రభుత్వం మనసును కొంతవరకైనా ప్రభావితం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో...
APGEA నాయకులు కిలారి నారాయణ రావు,
APTF -257 రాష్ట్ర అధ్యక్షులు కొప్పల భానుమూర్తి,
FAPTO జిల్లా కో - చైర్మన్ పేడాడ ప్రభాకర్,
APTF -1938 జిల్లా అధ్యక్షుడు టెంక చలపతిరావు,
SLTA జిల్లా అధ్యక్షుడు పిసిని వసంత రావు,
SC ST US జిల్లా ప్రధాన కార్యదర్శి బోనెల ఉమామహేశ్వరరావు,
SGTF రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ
SGTF జిల్లా B. రాజేశ్వరరావు
మరియు
APCPSEA నాయకులు
జిల్లా ప్రధాన కార్యదర్శి
రెడ్డి సూరిబాబు,
బోకర బాలక్రిష్ణ,
కరిమి రాజేశ్వరరావు,
VV రాజు,
బాడారి లక్ష్మణరావు,
మెండ రామారావు, తదితరులు
పాల్గొన్నారు..
0 Comments