ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సెప్టెంబర్ 24 కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్స్ సమ్మె జయప్రదం చేయండి.

నరసన్నపేట:కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని నరసన్నపేట నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం ఎండిఓ ఆఫీస్ ఆవరణంలో నిర్వహిస్తు ,అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా  సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల్లో పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మె జయప్రదం నికి స్కీం వర్కర్స్ సహకరించాలని పిలుపునిస్తున్నాయి. మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన నేషనల్ హెల్త్ మిషన్,ఆశా, అంగన్వాడి (ఐ సి డి ఎస్), మిడ్ డే మీల్స్, నేషనల్ రూరల్ లైవ్ లీ హుడ్ మిషన్(వెలుగు) మెప్మా నేకో (ఏపీ శాక్స్) నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్షాఅభియాన్, కేజీబీవీ,ఐఆర్ టి , ఉపాధి హామీ పథకాలలో నాలుగు లక్షల మంది గౌరవ వేతనం, కాంట్రాక్ట్, ఔవుట్సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిగా పనిచేస్తూరు. వీరిలో అంగన్వాడి ,ఆశా ,మధ్యాహ్న భోజనం, పథకాల్లో 2.5 లక్షల మంది చేత అతి తక్కువ వేతనాలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటున్నది. కరోనా కాలంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ చేత పని చేయించుకుంటున్నారు. విధినిర్వహణలో చనిపోయిన వారికి కరోనా సోకి వందలాది మంది ఈ పథకం లో పనిచేస్తున్నావారు. చనిపోయిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 లక్షలు ఇన్సూరెన్స్ ను వర్తింప చేయడం లేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని కుంటిసాకుతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింప చేయడం లేదు. తెల్ల రేషన్ కార్డులు తొలగించారు. కోవిడ్  డ్యూటీలో చేస్తున్న వారికి నెలకు 10,000 అదనపు వేతనం ఇవ్వాలి, ప్రాథమిక ఆరోగ్య విద్య, పోషకాహార సర్వీసు ప్రైవేటీకరణ విరమించుకోవాలి, మూడు ప్రజా వ్యతిరేక చట్టాలు నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్  లు రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న సెప్టెంబర్ 24 సమ్మెలో జయప్రదం చేయాలని వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలోటి అమర వేణు,జె . జగదీశ్వరి,ఎన్. చిన్నమ్మ డు, ఆర్ హేమలత, ఎ.రాధ,ఆర్. కాంతమ్మ, డి.సులోచన తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments