ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వెలమలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించండి.

*వెలమలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించండి. 

* వెలమ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి. 

* ఆది వెలమ, పద్మనాయక వెలమ లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. 

*వెలమ సామాజిక భవనాలకు స్థలాలు కేటాయించండి. 

*వెలమ హక్కుల సాధన కోసం డిసెంబర్ లో విశాఖ వేదికగా మహాగర్జన. 

*వెలమ లను బిసి.డి నుండి ఓసి నుండి బీసీఏ లో కి మార్చండి. 

విశాఖపట్నం:రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విద్యా వైద్య రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని "ఆంధ్ర ప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం" రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో 13 జిల్లాల నాయకులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. వెలమ సామాజిక వర్గాన్ని బిసి.డి నుండి, ఓసీ నుండి బీసీ.ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో జనాభా ప్రాతిపదికన వెలమలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. పోలినాటి వెలమ, కొప్పుల వెలమ లకు కార్పోరేషన్లు కేటాయించినప్పటికీ నిధులు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే ఆది వెలమ, పద్మనాయక వెలమ లకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేయాలని కోరారు.నామినేటెడ్ పోస్టులు,జిల్లా చైర్ పర్సన్, మండల పరిషత్ అధ్యక్షులు విషయంలో వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెలమ కుల జనాభా ప్రాతిపదికన పదవులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లా,నియోజకవర్గ కేంద్రాల్లో వెలమ సామాజిక భవనాలు ఏర్పాటు ('ఆంధ్ర ప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం' భవనాలు) చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఇన్చార్జ్ అమ్మాజీ, రమ్య ,వివిధ జిల్లాల ఇన్చార్జులు పెద్ది రెడ్ల సత్యం,వెంకట రాము,గోళ్ళు శ్రీను, వాసు,లవుడు శ్రీను, నారాయణ, మురళీమోహన్, శ్రీధర్ రామారావు, తదితర ఇతర జిల్లాల ఇన్చార్జులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments