ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దసరా సెలవులు ప్రకటించని పాఠశాలల,కళాశాలల పై చర్యలు తీసుకోండి. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్(పీ.టీ.ఎల్.యు) జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగు మన్మధరావు.

శ్రీకాకుళం:జిల్లాలో దసరా సెలవులు ప్రకటించని పాఠశాలలు,కళాశాలల పై డీఈఓ,ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని ప్రైవేటు టీచర్స్,లెక్చరర్స్ యూనియన్.(పి.టి.ఎల్.యు)జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగు మన్మధరావు ఒక ప్రకటనలో కోరారు.నేటి నుండి సెలవులు ప్రకటించినప్పటికీ ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలు యధావిధిగా పనిచేస్తున్నాయని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలల,కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు సెలవులు ప్రకటించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సరే ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ఇచ్చేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments