ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

యువ నాయకులు డాక్టర్ ధర్మాన క్రిష్ణచైతన్య చొరవతో ప్రారంభమైన నర్సింగపల్లి గ్రామ రోడ్డు పనులు..

ప్రజా పత్రిక-నరసన్నపేట మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి నర్సింగపల్లి గ్రామానికి రోడ్డు రాళ్ళు తేలి... గోతులమయంగా మారి గ్రామస్తులు నరకయాతన పడేవారు.. తరువాత రోడ్డు మంజూరు కావడం ... కాంట్రాక్టరు కాలయాపన చేయడం జరిగింది. ఉన్న రోడ్డుని తవ్వేయడంతో. వర్షం వస్తే బురదమయంగా మారి వాహనదారులు నానా అవస్థలు పడేవారు.  ఈ విషయాన్ని నరసన్నపేట యువ నేత డాక్టర్ ధర్మాన క్రిష్ణచైతన్య దృష్టికి తీసుకుని వెల్లగా... అక్కడి కక్కడే కాంట్రాక్టరుతో మాట్లాడారు. మీరు చేయకపోతే వేరే కాంట్రాక్టరు ద్వారా చేయించాలని ఆదేశించారు. దీంతో వేరే కంట్రాక్టరుతో మాట్లాడి నర్సింగపల్లి రోడ్డు పనులు ప్రారంభానికి కృషి చేసారు. నాగుల చవితితో రోడ్డు పనులు ప్రారంభమవ్వడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ,రోడ్డు పనులు ప్రారంభం కావడానికి కృషి చేసిన నరసన్నపేట నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ ధర్మాన క్రిష్ణచైతన్య కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Post a Comment

0 Comments