ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వెలమలకు రెండు ఎమ్మెల్సీలు కేటాయించాలని డిమాండ్.

శ్రీకాకుళం-ప్రజా పత్రిక:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 
నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి రెండు ఎమ్మెల్సీ లు కేటాయించి ప్రాధాన్యత కల్పించాలని "ఆంధ్ర ప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం" రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.వెలమ సామాజిక వర్గానికి కనీసం రెండు ఎమ్మెల్సీ లను కేటాయించాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇప్పటికే మంత్రి పదవులల్లో,నామినేటెడ్ పదవుల్లో,జిల్లా పర్షిత్ చైర్పర్సన్ మొదలగు నామినేటెడ్ పదవుల్లోనూ తమ వెలమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెలమ సామాజిక వర్గానికి రెండు ఎమ్మెల్సీ లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెలమ సామాజిక వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గడిచిన రెండున్నర సంవత్సరాలలో ప్రాధాన్యత కల్పించలేదని కావున ఇప్పుడైనా సరే 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం రెండు ఎమ్మెల్సీ స్థానాల కైనా ప్రాధాన్యత కల్పించాలని ఆ ప్రకటనలో కోరారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో బలమైన వెలమ సామాజిక వర్గానికి రాజకీయాల్లో  ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments