పోలాకి:ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు స్వర్గీయ గరిమెళ్ళ సత్యనారాయణ 69 వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన స్వగ్రామం ప్రియాగ్రహారం లో గరిమెళ్ళ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గరిమెళ్ళ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బాడాన రాజు మాట్లాడుతూ గరిమెళ్ళ భారత జాతి మరచిన జాతి రత్నం అని అన్నారు. నేటి తరం స్మరించుకునే విదంగా గరిమెళ్ళ జయంతి, వర్ధంతి వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.గరిమెళ్ళ వ్రాసిన మాకొద్దీ తెల్లదొరతనం కి వందేళ్లు పూర్తి అయిందని ఆయన గుర్తు చేశారు. త్వరలో గరిమెళ్ళ పేరిట ప్రత్యేక తపాలా ముద్రిక ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ సర్పంచ్ బెవర నూకరాజు మాట్లాడుతూ గరిమెళ్ళ పేరిట ప్రియాగ్రహారం లో శాఖా గ్రంధాలయం మంజూరు చేయాలని కోరారు. సామాజిక సమరసత ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్. కృష్ణ మాట్లాడుతూ త్వరలో జరగబోయే జిల్లాల పునర్విభజన లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు గరిమెళ్ళ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు గెడ్డాపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆరవ తరగతిలో మాకొద్దీ తెల్లదొరతనం గేయం పాఠ్యాంశంగా చేర్చడం మనకు గర్వకారణం అని అన్నారు. గరిమెళ్ళ ట్రస్ట్ సభ్యులు ఐ. గణపతి రావు మాకొద్దీ తెల్లదొరతనం పాట పాడి వినిపించారు.
ఈ కార్యక్రమంలో గరిమెళ్ళ ట్రస్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి.ఎస్. శర్మ, బాడాన రాజు, స్థానిక సర్పంచ్ బెవర నూక రాజు, సామాజిక సమరసత వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ, ప్రధానోపాధ్యాయులు గెడ్డాపు రాజేంద్రప్రసాద్,కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శర్మ, సభ్యులు ఐ. గణపతి రావు, డి. కోటేశ్వరరావు, బాల మురళీకృష్ణ, రఘు పాల్గొన్నారు
0 Comments