శ్రీకాకుళం:నాగావళి నది కాలుష్యం శ్రీకాకుళం నగర ప్రజలకు,పరిసర గ్రామల ప్రజలకు శాపంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు రాష్ట్ర కమిటీ సభ్యులు బి.కృష్ణమూర్తి అన్నారు.స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సీపీఎం సమావేశంలో వారు మాట్లాడుతూ గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన శ్రీకాకుళం ప్రజలకు జీవనాధారంగా ఉన్న నాగావళి నదిలో కోవిడ్ వ్యర్ధాలు, మలమూత్రాలు, మురికినీరుతో నిండి పోయిందని విమర్మించారు.దీని వలన శ్రీకాకుళం పట్టణ ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.నాగావళి నది తాగునీరు బావులు వద్దకు 13 మురికి నీటికాలువులు,వాటి ద్వారా పట్టణంలో ఉన్న రిమ్స్ తో సహా ప్రైవేటు ఆస్పత్రులు రోగులు వ్యర్థాలను ఎస్.టి.పి ప్లాంట్ ద్వారా శుద్ధి చేయకుండా నాగావళి నదిలోకి విడిచిపెట్టడం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని విమర్శించారు.మురికినీటిని శుద్ధి చేసి ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని వారు ప్రశ్నించారు. కలుషిత నీరే ప్రజలు మంచినీరుగా తాగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వము నాలా పన్నులు, ప్లానింగ్, ఇంటి పన్ను, చెత్తపన్ను తదితర రకాల పన్నులు ద్వారా కోట్ల రూపాయిలు ప్రజలు వద్ద నుండి వసూళ్ళు చేసి కనీసం మురికి నీరును శుద్ధిచేసే పని కూడా చేయడం లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాలు పట్ల ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం అవుతుందని వారు విమర్శించారు.కలుషిత జలాలు ప్రజలు త్రాగడం వలన అనారోగ్యం పాలవుతున్నారని విమర్శించారు. రిమ్స్ లో ఎస్.టి.పి.ప్లాంట్ పని చేయకవడం, ఆవ్యర్ధాలు అన్ని నాగావళి నదిలో కలుస్తున్నాయని విమర్శించారు. అదే విధంగా సెప్టిక్ ట్యాంక్లు రాత్రిపూట నాగావళి నదిలో విడిచిపెడుతున్నారని నగరవాసులు మా దృష్టికి తీసుకువచ్చారని వారు తెలిపారు.పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు అనారోగ్యానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వారు విమర్శించారు.
ఆసుపత్రి వ్యర్ధాలును, మురికినీరును ఎస్.టి.పి ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి విడిచి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ప్రజలకు మంచినీరు అందించాలని,నాగావళి నదిని కాలుష్యం బారి నుండి కాపాడి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.తిరుపతిరావు మాట్లాడారు.
0 Comments