ప్రజా పత్రిక-నరసన్నపేట:ప్రజల మనసు తెలుసుకుని మనసుతో పాలించే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డని శిష్టకరణ బీసీ కార్పొరేషణ్ డైరెక్టర్ సదాశివుణి కృష్ణ అన్నారు.ఈ మేరకు నరసన్నపేటలో విలేకరుల సమావేశంలో కృష్ణ మాట్లాడారు.సి ఎం జగన్రెడ్డి నేడు అంధ్రప్రదేశ్ లొ అందిస్తున్న పాలనపై దేశమంతా తొంగి చూస్తుందని డైరెక్టర్ కృష్ణ ఆన్నారు.పరిపాలన సౌలభ్యం దృష్టిలొ పెట్టుకొని రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చెయ్యటం ద్వార ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పం వ్యక్తమౌతుందని ఆయన ఆన్నారు.గతంలో ఎచ్చెర్ల విజినగరంలో కలిసిపోతుందని భయపడ్డామని అయితే మన ఉపముఖ్యమంత్రి ధర్మాణ కృష్ణదాసు సిఎం ను స్వయంగా కలసి ఎచ్చెర్లను మన జిల్లాలో ఉంచేలా కృషి చేశారని కొనియాడారు. ప్రజల సమస్యలు ఆయన దృష్టికి వెళితే వెంటనే పరిష్కరించాలని చూసే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఒక్కరేనని డైరెక్టర్ కృష్ణ ఆన్నారు.ఈ కార్యమంలో విశ్రాంత మేజిస్ట్రేట్ సదాశివుణి ప్రభాకరరావు,విశ్రాంతి ఎంపీడీఓ డివి రఘు విశ్రాంతి ఏ ఎస్ ఐ బెహరా రాంమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments