ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిల్లాల పునర్విభజనలో సిక్కోలుకు సముచిత ప్రాధాన్యత -ఎచ్చెర్లని శ్రీకాకుళంలోనే కొనసాగిస్తూ నిర్ణయం -డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

జిల్లాల పునర్విభజనలో సిక్కోలుకు సముచిత ప్రాధాన్యత 
-ఎచ్చెర్లని శ్రీకాకుళంలోనే కొనసాగిస్తూ నిర్ణయం
 -డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచనలకు గుర్తింపు
 -అంబేద్కర్ వర్శిటీ, ట్రిపుల్ ఐటీ, పారిశ్రామిక ప్రాంతాలు ఈ జిల్లాలోనే
-కొత్త జిల్లాలపై సర్వత్రా హర్షామోదాలు

శ్రీకాకుళం,జనవరి 29:పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుండడంపై అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో పార్లమెంటు నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకుంటారనే నిర్ణయాలు మొదట్లో వినిపించాయి. దీంతో విద్యాపరంగా జిల్లాలో అంబేద్కర్ యూనివర్శిటీ, ట్రిపుల్ ఐటీ, పారిశ్రామిక ప్రాంతంతో ప్రగతి ఉపాధిపరంగా ముందున్న  ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో కలిసిపోతుందనే అందోళన జిల్లావాసుల్లో అధికమైంది.ఇదే అంశంపై మొదట్నుంచీ తగిన అవగాహన, ప్రజల ఆంకాక్షలపై నిబద్ధత గల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో కలిసి నివేదించారు. ఫలితంగా ఆయన కృషితో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇదే విషయంపై ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ పరిపాలన సౌలభ్యం,సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టామన్నారు.ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే స్వీకరిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కోరుకున్నట్లు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అతి ముఖ్యమైన రూరల్ యూనివర్సిటీ, పారిశ్రామిక వాడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటాయని డిప్యూటీ సీఎం. కృష్ణదాస్ తెలిపారు. వచ్చే ఉగాది (ఏప్రిల్ 2) నుంచి కొత్త జిల్లాలో పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments