ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రాష్ట్రంలో రూ3,500కోట్లతో రోడ్లు నిర్మాణం
 -నాణ్యతలో రాజీలేదు.. నిధుల కొరత లేనేలేదు
- ఏడాదిలోగా రోడ్లన్నీ పూర్తికావాలి
 -రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రాజాబాబు
నరసన్నపేట : రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కార్పొరేషన్ తరుపున రూ3,500 కోట్లు కేటాయించామని రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి రాజాబాబు అన్నారు. ఆయన ఆదివారం నరసన్నపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించానని అన్ని చోట్లా రోడ్ల నిర్మాణంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తోందని అన్నారు. అధికారులు జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. నాణ్యత, మన్నిక విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లన్నీ ఏడాదిలో పూర్తి చేస్తామని ఇదివరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారని, ఆ దిశగా తాము సకాలంలో వాటిని పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు.  అధికారులు అశ్రద్ధ చేస్తే కుదరదనీ గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. నిధుల కొరత ఎక్కడా లేదని, నాణ్యతలో రాజీపడే ప్రశ్నే లేదన్నారు.

ఈ పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత నిస్తోందని అన్నారు. అధికారులు కూడా మరింత బాధ్యతతో పనిచేసి రోడ్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో ఆర్అండి ఎస్ఇ కాంతిమతి, టెక్కలి ఇఇ పి.సత్య నారాయణ, , శ్రీకాకుళం ఇఇ ఎస్. రవి నాయక్, ఆర్ఆండ్బి డిఇఇ గణపతి, ఏఇ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments