శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని హడ్కో కాలనీ దగ్గర సింహాద్రి అప్పారావు ప్లాస్టిక్ సంచి లో 14,490 రూపాయలు ఖైనీ గుట్కా తో పట్టుబడ్డారని ఎస్సై సింహాచలం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కైని గుట్క అక్రమంగా తరలిస్తుండగాముందస్తు సమాచారంతో పెట్టుకున్నామన్నారు.అలాగే ఆయన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా అక్రమ ఖైనీ గుట్కా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఖైనీ గుట్కాతరలిస్తున్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.ఈ ఖైనీ గుట్కా పట్టివేత కు సహకరించిన పోలీసులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments