ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బంకుపల్లి సేవలను ఆదర్శంగా తీసుకోవాలి.

నరసన్నపేట: వివాహ తత్వంపై పరిశోధన చేసి,వేదాలను తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తి మల్లయ్యశాస్త్రిని పలువురు వక్తలు కొనియాడారు.గొప్పనాయకులు చేసే గొప్ప సంఘసేవా  కార్యక్రమాలు సమాజానికి తెలియచేయటానికి సామాజిక సమరసత వేదిక కృషి చేస్తుందని వక్తలన్నారు.ముందుగా VNB కళ్యాణమండపంలో బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మల్లయ్యశాస్త్రిపై పరిశోదన చేసిన డాక్టరు దార్లపూడి శివరామకృష్ణ మనుమడు బంకుపల్లి లోకనాధ్ శర్మ,రాష్ట్ర,సంయోజక పి.హఠకేసం,అర్ ఎస్ ఎస్ ప్రతినిధులు పి వి రమణమూర్తి బల్లెడ కృష్ణారావు,బాల మురళీకృష్ణ,సామాజిక సమరసతా వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ( విలేకరి కృష్ణ ) సమరసత్వవేదిక ప్రతినిధులు మెరక నర్సింహులు,బార్ల వేణు,వెంకటరమణ రమణ తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన "మాలపల్లి"నవలపై సాహిత్యగోష్టి నిర్వహించారు.ఈ కార్యక్రమం కవులు భమిడిపాటి గౌరీశంకర్ డార్లపూడి శివరామకృష్ణ ,కె హేమసుందర్ పి.శ్రీనివాసరావు,ఐ.దుర్గాప్రసాద్, సామాజిక సమరసతా వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ( విలేకరి కృష్ణ ) ఆర్ ఎస్ ఎస్, చైతన్య భారతి కన్వీనర్ చింతు పాపారావు,తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments