ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సంక్షేమ పదకాలకు సారదులు వార‌ధులు వలంటీర్లే. శాసన సభ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీకాకుళం ఏప్రిల్ 09 :-- సంక్షేమ ప‌థ‌కాల సారదులు, వార‌ధులు వ‌లంటీర్లే అని శ్రీ‌కాకుళం శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండల  వ‌లంటీర్ల‌కు వంద‌నం పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..గడిచిన రెండు సంవత్సరాలుగా వ‌లంటీర్లు అందిస్తున్న సేవ‌ల‌ను గుర్తించి, ప్ర‌భుత్వం త‌ర‌ఫున పుర‌స్కారాలు అందిస్తున్నామ‌ని అన్నారు. వ‌లంటీర్ల సేవను ప్రభుత్వం గమనిస్తుందని,  ప‌థ‌కాల అమ‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌రుతుంద‌ని, ఇందుకు ప్ర‌ధాన కారణం సీఎం జగన్ తీసుకు వచ్చిన సచివాలయ వ్యవస్థే అని అన్నారు. లంచాలు ఇస్తే తప్ప పనులు జరగవు అన్న నమ్మకానికి పక్కన పెట్టి పారదర్శకమైన, లంచాలకు, వివక్షకు తావులేని పాలన సాగిస్తున్నామ‌ని చెప్పారు.

కులాలకూ, మతాలకూ, స్థానిక రాజకీయాలకూ, పార్టీలకూ తావు లేకుండా ప్ర‌భుత్వం త‌ర‌ఫున అర్హుల‌యిన ప్ర‌తి ఒక్క‌రికీ సహాయం అందిస్తున్నామ‌న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు  లంచాలకు, వివక్షకు తావులేకుండా, రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడికీ అందేలా చేయ‌గ‌లుగుతున్నార‌ని తెలిపారు. అవినీతికి రహిత పాలన అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాల సాగిస్తున్నారని అన్నారు.

 ప్రభుత్వం ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారధులు మీరేనని అన్నారు. అవినీతి రహితంగా ప్రతి ఉద్యోగి ఉండాలి అని, మీకు ఎంతో భవిష్యత్ ఉందని సచివాలయ ఉద్యగులను ఉద్దేశిస్తూ అన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల కన్నా మిన్నగా కోవిడ్ కాలంలో సేవలు అందించామ‌ని, అందుకు  సచివాలయ వ్యవస్థ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డింద‌ని  గుర్తు చేస్తూ, సంబంధిత ఉద్యోగుల అంకిత భావాన్ని సైతం కొనియాడారు.

శ్రీకాకుళం రూరల్ ఎంపీ డీవో  వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ధర్మాన రం మనోహర్ నాయుడు,ఎంపీపీ  అంబటి నిర్మల, జెడ్పీటీసి సభ్యులు  రూప్ప దివ్య, సర్పంచ్ లు,అంబటి శ్రీను, ముకల్లా తాతబాబు,చాలా రవి, చిట్టీజనార్దన్,ఎంపీటీసిలు,అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments