నరసన్నపేట మండలం బొరిగి వలస గ్రామంలో రేపు బాదుడే బాదుడు కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు టిడిపి మండల యువత అధ్యక్షులు తంగి తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాదుడే బాదుడు కార్యక్రమానికి ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరవుతారు అన్నారు. మండల టిడిపి మాజీ ఎంపీపీ, జడ్పిటిసిలు, ప్రస్తుత సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు,టిడిపి అభిమానులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతము చేయాలని కోరారు.
0 Comments