పోలాకి:- జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. కీ.శే ముద్దాడ విజయ వెంకటప్పనాయుడు జ్ఞాపకార్థంగా ఈనెల 28,29 తేదీల్లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పోలాకి మండలం యూదులవలస ఏపీ మోడల్ స్కూల్/కాలేజ్ ప్రిన్సిపాల్ పి. ప్రవీణ తెలిపారు.అమ్మాయిలకు,అబ్బాయిలకు వేరువేరుగా క్రాస్ కంట్రీనిర్వహించడం నిర్వహించడం జరుగుతుందన్నారు.మొదట విభాగం జూనియర్స్ 6వ తరగతి నుండి 10వ తరగతి లోపు విద్యార్థులు మీ పేరు,అడ్మిషన్ నెంబరు మరియు హెడ్మాస్టర్ సంతకంతో హాజరు కావాలన్నారు.అప్పుడే ఆ టీమ్ ని అనుముతించడం జరుగుతుందన్నారు. లేని ఎడల టీం ని ఎన్రోల్మెంట్ చేయడం జరగదన్నారు.కావున ఫిజికల్ డైరెక్టర్ లు అందరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నామన్నారు.
రెండో విభాగం సీనియర్ మెన్ క్రీడాకారులు మీ యొక్క పేరును ముందుగానమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు.ఈనెల 28,29 తేదీల్లో వాలీబాల్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.28వ తేదీ ఉదయం 8 గంటలకు క్రీడాకారులందరూ హాజరు కావలసిందిగా కోరడమైనన్నారు.8 గంటలకి డ్రా తీయడం జరుగుతుంది కాబట్టి 8 గంటలకు వచ్చిన టీములు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నామన్నారు.ఈనెల 29 ఉదయం 6:30 నిమిషాలకు క్రాస్ కంట్రీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మాయిలకు 3km అబ్బాయిలకి 5km నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ ఎం. నీలం.సెల్.....8008282009 నెంబర్కు సంప్రదించాలన్నారు. ఈ చక్కన అవకాశాన్ని అర్హత గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
0 Comments