ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించిన శిక్షార్హులు.సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఆర్. సన్యాసి నాయుడు

శ్రీకాకుళం, ఆగస్ట్ 24:- బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించిన శిక్షార్హులు అని సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఆర్. సన్యాసి నాయుడు అన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగ అహర్నిశలు ఉన్నత విద్య సముపార్జనకు కృషి చేయాలి,  చదువు అనేది తరగని పెన్నిధి మనిషి అభివృద్ధికి చదువును మించి మరొకటి మార్గం లేదు. పిల్లలతో పని చేయించి వారిని బాల కార్మికులుగా మార్చిన వారు చట్ట ప్రకారం కఠిన శిక్ష కు పాత్రులు.      గౌరవ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ      గుత్తాల గోపి గారి ఆదేశము మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఆర్. సన్యాసి నాయుడు విద్యా హక్కు చట్టం మరియు బాల కార్మిక వ్యవస్థను నిర్మలించడం, పిల్లలతో యాచకత్వము చేయించే వికృత చేష్టల నిర్మూలన పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ శ్రీ ప్రసాద్ రావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ స్కూల్ ఏడ్యుకేషన్  ఎం. శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ చెల్డ్ ప్రొటెక్షన్ అధికారి కె.బి.రామారావు,, ఛైర్పర్సన్, చిల్డ్ వెల్ఫేర్ కమిటీ  శ్రీమతి యు. శ్రీలక్ష్మీ , ఎన్.జి. ఓ, మంత్రి వెంకట స్వామి, వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments