ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

భావి త‌రాల కోసమే స‌మున్న‌త నిర్ణ‌యాలు

భావి త‌రాల కోసమే స‌మున్న‌త నిర్ణ‌యాలు
- మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి
- రెవెన్యూ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు 
-  సింగుపురం క‌స్తూరీ బా పాఠ‌శాలకు
అద‌న‌పు త‌ర‌గ‌తి గదుల నిర్మాణానికి శంకుస్థాప‌న
- శిలగాం శింగివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..రూ. 132.94 లక్షల అంచనా వ్యయంతో తరగతి గదులు నిర్మాణం, మౌలిక వసతులు కల్పన పనులకు శంకుస్థాపన

శ్రీకాకుళం రూరల్  : మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం (సింగుపురం) ప్రాంగ‌ణాన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన  ప్ర‌సాద‌రావు శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఇక్క‌డి విద్యార్థినుల‌తో ఆయ‌న ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌కు వైఎస్సార్  కాంగ్రెస్ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని అన్నారు. తాను విద్యార్థినుల‌తో మాట్లాడాన‌ని, వారంతా ఇక్క‌డి వ‌స‌తులు, పాఠ‌శాల నిర్వ‌హ‌ణ, అందిస్తున్న భోజ‌న వ‌స‌తుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని అన్నారు. నాడు- నేడు ఫేజ్-2 లో భాగంగా మొత్తం 48 ల‌క్ష‌ల రూపాయ‌ల అంచ‌నా విలువ‌తో ప‌నులు చేప‌డుతున్నామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ఇవాళ చేప‌డుతున్న అనేక పాల‌నప‌ర సంస్క‌ర‌ణ‌లు ఫ‌లితాలు ఇస్తున్నాయని, వాటికి ఉదాహ‌ర‌ణే ఇక్క‌డి పాఠ‌శాల నిర్వ‌హ‌ణ అని అన్నారు. మీరు ఈ పాఠ‌శాలను చూశారు..చాలా మంచి ప్ర‌మాణాల‌తో నిర్మాణం చేశారు. అదేవిధంగా నాడు-నేడు లో భాగంగా అనేక పాఠశాల‌ల రూపురేఖ‌ల‌న్న‌వి మారిపోయాయి. అదేవిధంగా ఇక్క‌డి ఉపాధ్యాయినులు అంద‌రూ కూడా చాలా శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. ఇక్క‌డ శానిటైష‌న్ కానీ టాయిలెట్స్ నిర్వ‌హ‌ణ కానీ ఫుడ్ కానీ పాఠ్యాంశాల బోధ‌న‌లో కానీ ఇత‌ర‌త్రా విష‌యాల బోధ‌న‌లో కానీ ఇక్క‌డి వారి అంకింత భావం మీరు చూడ‌వచ్చు. అదేవిధంగా విద్యార్థినుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో ఉంచడంలో చాలా బాగా ప‌నిచేస్తున్నార‌ని నేను భావిస్తున్నాను. అభిప్రాయ‌ప‌డుతు న్నాను. ఈ అద‌న‌పు త‌ర‌గతి గ‌దుల నిర్మాణాన్ని మ‌రో 90 రోజుల్లో పూర్తి చేసి, ఈ పాఠ‌శాల నిర్వాహ‌కుల‌కు అందిస్తాం. ఇక్క‌డి విద్యార్థినులు త‌మ‌కు ఇంకో డార్మేట‌రీ కావాల‌ని, ఇంకొన్ని అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు కావాల‌ని కోరారు. అందుకు త‌గ్గ విధంగా సంబంధిత అధికారులతోనూ, త‌ల్లిదండ్రుల‌తోనూ మాట్లాడి సంబంధిత ప‌నులు చేప‌ట్టేందుకు నిధులు మంజూరు చేయిస్తాను. " ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీటి స‌మ‌స్య ఉంది. అదేవిధంగా తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం. కేవ‌లం ఎన్నిక‌లు, ఓట్లు, అధికారం ద‌క్కించుకోవ‌డం అన్న‌వే కాదు మ‌న త‌రువాత త‌రాల‌ను ఎంత చ‌క్క‌నైన పౌరులుగా త‌యారు చేయగలం, వారి భ‌విష్య‌త్ కు అవ‌స‌రం అయిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ఏ విజ్ఞ‌త ఉన్న ప్రభుత్వానికి అయినా ఎంతో అవ‌స‌రం. నేను క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను భావి త‌రాల కోసం ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నిర్ణ‌యాలు అన్న‌వి జ‌రుగుతున్నాయి. త‌రువాతి త‌రం మ‌రిన్ని మెరుగ‌యిన వ‌స‌తులు అందుకునేలా, మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దేలా ఈ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఫ‌లితాలు ఇస్తాయ‌ని, అదేవిధంగా భావి త‌రాలు ఇప్ప‌టి నిర్ణ‌యాల కార‌ణంగా వ‌ర్థిల్లుతాయ‌ని భావిస్తున్నాను. ఇవే న‌మ్మి మేమంతా ప‌నిచేస్తున్నాం. దేశానికీ, రాష్ట్రానికీ పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకుని వ‌చ్చే విధంగా రేప‌టి త‌రం ఉండే విధంగా ఇప్ప‌టి నిర్ణ‌యాలు అన్న‌వి తీసుకుంటున్నాం. అమ‌లు చేస్తున్నాం. ఇదంతా ఓట్లు కోస‌మే అన్న భావ‌న‌తో కొంద‌రు మాట్లాడుతున్నారు. ఆ భావ‌న అన్న‌ది త‌ప్పు. అది అబ‌ద్దం అని మ‌న‌వి చేస్తున్నాను. ఈ పాఠ‌శాల విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌ను అడిగి చూడండి. ఎలాంటి మార్పు వ‌చ్చిందో చెబుతారు. గ‌తంలో ఇలాంటి మార్పు మీరు చూడ‌లేదు. కానీ ఈనాడు అది స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇదీ ఆనాటి ప్ర‌భుత్వానికీ, ఈనాటి ప్ర‌భుత్వానికీ ఉన్న తేడా" అని చెప్పారాయ‌న‌. అదేవిధంగా శిలగాం - శింగువలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాడు నేడులో భాగంగా రూ.132.94 లక్షల అంచనా వ్యయంతో రూపు రేఖ‌లు మార్చ‌నున్నా మని అన్నారు. ఇందులో భాగంగా 6 తరగతి గదులు నిర్మాణానికి 70 లక్షల రూపాయ‌లు కేటాయించామ‌ని,62.94 లక్షల రూపా యలతో మౌలిక వసతులు కల్పన చేయ‌నున్నామ‌ని తెలిపారు.
ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడిన పాయింట్స్..

- ప్రభుత్వం విద్యకు స‌మున్న‌త ప్రాధాన్యం ఇస్తోంది.. 
- అందరూ బాగా చదివి వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగాలని, 
అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాల్లో మన రాష్ట్రం ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
- రేపటి తరం , రేపటి సమాజం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు జగన్.
- స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లు అయినా ఇంకా కొంద‌రిని వేధిస్తుంది. అందుకే పేద‌రికం పార‌ద్రోలి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. 
- అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొద‌ల‌య్యాయి.
- ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం మనం చేపడితే 
100 ఏళ్ళు నిలబడేలా ఉండాలి అని సూచన.
- సమాజాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంద‌ర్భాల్లో 
ప్రభుత్వం  కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. 
 నిజాయితీగా పని చేయడం అందరూ అలవర్చుకోవాలి.
- పథకాలు అందించే క్రమంలో పార్టీ చూడడం లేదు.
- ఆకలి, కన్నీరు, పేదరికం ప్రామాణికంగా అమలు చేస్తున్నాం.
- హిరమండలం గొట్టా బ్యారేజ్ వ‌ద్ద లిఫ్ట్ పెట్టడానికి 
రూ.200 కోట్లు అవసరం అవుతుంది.
- 2023 ఆగస్ట్ లోగా పూర్తి చేస్తాం, 2024 వేసవిలో వంశధార నీరు అందించే ప్రయత్నిస్తున్నాం.
- వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలి. 
- మా ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీస్సులు కావాలి. 
- ఈ స్కూల్ కి సైకిల్ షెడ్ కావాలి అని అడిగారు, త్వరలో మంజూరు చేసి పూర్తి చేస్తాం.

ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాస్, ఎపిసి రొనంకి జయప్రకాష్, డీఈవో పగడాలమ్మ, ఎమ్మార్వో వెంకట్రావు, అంబటి శ్రీనివాసరావు, ముకళ్ల తాత బాబు, చిట్టి జనార్దన్ రావు, కంచు వసంతారావు, బాన్న నర్సింగ రావు,ఎచ్చెర్ల శ్రీధర్, చంద్రమౌళి, యూటపల్లి కృష్ణ, సర్పంచ్లు ఆదిత్య, కంచు రమణమ్మ, ఎంపిటిసిలు బగ్గు అప్పారావు, నక్క శంకర్, పేరెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments