శ్రీకాకుళం, ఆగస్టు 24 : ఎచెర్ల బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ళ విద్యార్థిని మృతిపై జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ బుధవారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. గురుకులంలోని విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ ఏ ఒక్క విద్యార్థి అధైర్యపడొద్దని, ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. మీకు అండగా జిల్లా యంత్రాంగం ఉంటుందని, విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చిన స్వయంగా కలిసి మీ ఫిర్యాదులను తెలియజేయవచ్చని, వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
0 Comments