అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అగ్ర తాంబూలం వేస్తున్నదని మాజీ డిప్యూటీ సీఎం, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈదుల వలసలో వాలీబాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ముద్దాడ విజయ వెంకట అప్పలనాయుడు స్మారక పేరిట పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ జగన్నాధ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కామన్వెల్త్ పోటీలలో పట్టకాలు సాధించిన సింధు, రజనీలను సీఎం జగన్ అభినందించి ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేశారని గుర్తు చేశారు. సింధూకు విశాఖలో బ్యాట్మెంటన్ అకాడమీ కోసం విశాఖలో రెండు ఎకరాలు కేటాయించామని అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే.. ఔత్సాహిక క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని ఫలితంగా అంతర్జాతీయ క్రీడా వేదికలపై మన వాళ్లు గొప్పగా రాణించగలుగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగి నాయుడు, ప్రిన్సిపాల్ ప్రవీణ, స్థల దాతలు గ్రామ పెద్దలు, ఫిజికల్ డైరెక్టర్ నీలం తదితరులు పాల్గొన్నారు.
0 Comments