ప్రజాపత్రిక:ఆగస్టు 28:ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం రామాటాకీస్ థియేటర్ వెనుక ఉన్న శ్రీనగర్ లో ఉన్న వెలమ భవనంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెలమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లాలో మున్నూరు కాపులను ఏవిదంగా బి సి డి జాబితా లో ప్రభుత్వం చేర్చందో అదే తరహాలో వెలమలను బిసి.డి జాబితా నుంచి బిసి.ఏ జాబితాలోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులకు మూడేళ్ల అమలు జరుగుతున్న కాపు నేస్తం పథకం వలె వెలమలకు వెలమ నేస్తం పథకాన్ని వెలమ మహిళలకు ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలోను , ప్రసిద్ధి పుణ్య క్షేత్రాలలో వెలమ భవనాలకు స్థలాలు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 25 వ తేదీన విశాఖపట్నం వేదికగా రాష్ట్ర విస్త్రుత స్థాయి సమావేశంలో వెలమ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఘణముగా సన్మానం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పెదిరెడ్ల సత్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ గొల్లు శ్రీను,పార్వతీపురం జిల్లా ఇంచార్జి పెదిరెడ్ల శ్రీనివాస్,విజయనగరం జిల్లా ఇంఛార్జి బొత్స స్వామి నాయుడు,పశ్చిమ గోదావరి జిల్లా ఇంఛార్జి నూరెడ్డి శివ,సురేందర్, శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జి వాదాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు
0 Comments