నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన స్వర్గీయ గుమ్మడి అచ్చెయమ్మ జ్ఞాపకార్ధం ఆమె చిన్న కుమారుడు గుమ్మడి శ్రీనివాసరావు గ్రామంలోని 3 దేవాలయాలకు మైక్ సౌండ్ సిస్టమ్‌ను వితరణగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు.
శుక్రవారం ఉదయం దేవాలయాల వ్యవస్థాపక ధర్మకర్తలకు గ్రామ పెద్దలు పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు పాగోటి ప్రభాకరరావు, సర్పంచ్ పాగోటి కుసుమ మోహనరావు, ఎం.పి.టి.సి పాగోటి గౌతమి రమణ భరద్వాజ్ సమక్షంలో అందజేసారు. గ్రామంలోని శ్రీ స్వయంబేశ్వర దేవాలయం, నీలమణి దుర్గ ఆలయం, త్రినాధ స్వామి దేవాలయాలకు ఈ మైక్ సౌండ్ సిస్టమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైక్ సౌండ్ సిస్టమ్ విలువ సుమారు 2 లక్షలకు పైగా వరకు ఉంటుందని , తల్లి మీద ఉన్న ప్రేమతో ఆమె జ్ఞాపకార్ధం అందజేసినట్టు గుమ్మడి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాగోటి అప్పల స్వామి, పాగోటి ఉమామహేశ్వరి, రేవతి, అల్లు లచ్చమనాయుడు, కొరికాన గురునాధం, బుదిరెడ్డి చంటి, అల్లు లక్షణరావు, సిరినెల్లి వెంకటరమణ, జయసూర్య సేవా సంఘం అధ్యక్షులు పాగోటి సూర్యనారాయణ , వలంటీరు గుజ్జిడి గోవిందరావు తో పాటు దేవాలయ అర్చకులు వసనాభి జగదీష్ తదితరులు పాల్గోన్నారు.
0 Comments