ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తీరనున్న తీరప్రాంతవాసుల కల- వంశధారపై రూపుదిద్దుకుంటున్న వనితమండలం- గార వంతెన- రూ. 72 కోట్లు మంజూరు చేయించిన ధర్మాన కృష్ణదాస్

తీరనున్న తీరప్రాంతవాసుల కల
- వంశధారపై రూపుదిద్దుకుంటున్న వనితమండలం- గార వంతెన
- రూ. 72 కోట్లు మంజూరు చేయించిన ధర్మాన కృష్ణదాస్
-వచ్చే వేసవి నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం
పోలాకి, అక్టోబర్ 19:

వంశధార నదీ తీర ప్రాంతీయుల దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. బతికుండగా చూస్తామో? లేదో? ననే కల ఎట్టకేలకు తీరనుంది. నరసన్నపేట- శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ వంశధార నదిపై పోలాకి మండలంలోని మబగాం వనితమండలం గ్రామాల నుంచి గార మండలానికి వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పురాతన కాలంలో గార మండలంలోని శాలిహుండాం నుంచి వనిత మండలానికి వంశధార నదిపై వంతెన ఉండేదని ప్రాచీన గ్రంథాలలో ఆనవాళ్లు ఉన్నాయి. బంధువులు చుట్టరికాలు అటు ఇటు ఉన్నవారే. నది దాటితే చాలు అటు ఇటు బందు మిత్రులతో గ్రామాలు కలకలలాడేవి. వ్యవసాయ, మత్స్య సంపద, వాణిజ్యంతో ఎంతో వైభవంగా ఉండేది. కానీ ఇప్పడు పోలాకి మండలంలోని వారు గార మండలానికి వెళ్లాలన్నా, అటువారు ఇటు రావాలన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాను ఆర్అండ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే రూ.72 కోట్ల రూపాయలు ఈ వంతెన నిర్మాణాని

Post a Comment

0 Comments