ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్.జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ.

నవంబర్12న జాతీయ లోక్ అదాలత్.

కేసుల పరిష్కారమే ప్రధాన లక్ష్యం.

జిల్లా న్యాయ సేవాధికారి గోపీ.

శ్రీకాకుళం, అక్టోబర్ 19:-  రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలు అనుసరించి నవంబర్ 12 వ తేదీన శ్రీకాకుళంలో అన్ని కోర్టు  సముదాయాలలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ , శ్రీకాకుళం  గుత్తాల గోపీ తెలిపారు. ఈ సదర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి  శ్రీకాకుళంజిల్లా  లో  న్యాయ మూర్తులతో సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, అందరు న్యాయ అధికారులను జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయటం కోసం అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అదనపు జిల్లా న్యాయ మూర్తులు  టీ . వెంకటేశ్వర్లు, జి. చక్రపాణి, శ్రీమతి కె. శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీమతి కే. నాగమణి, శ్రీమతి  ఎం.అనురాధ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments