ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అయోడిన్ ఉన్న ఉప్పునే వాడాలి.జిల్లా ఆహార నియంత్రణాధికారి వెంకటరత్నం.

అయోడిన్ ఉన్న ఉప్పునే వాడాలి.జిల్లా ఆహార నియంత్రణాధికారి వెంకటరత్నం.
21న అయోడిన్ లోపం నివారణ దినోత్సవం.
శ్రీకాకుళం,అక్టోబర్,19: అయోడిన్ ఉన్న ఉప్పునే వాడాలని జిల్లా ఆహార నియంత్రణాధికారి వెంకటరత్నం వెల్లడించారు. బుధవారం పాత బస్టాండ్ వద్ద గల మార్కెట్ వ్యాపారులకు అయోడి ఉన్న ఉప్పు తయారీదారులు, అమ్మకం దారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయోడిన్ లేని ఉప్పు ను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయోడైజ్ చేయని ఉప్పు అమ్మకం నిషేధించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి, NIDDCP జిల్లా కోఆర్డినేటర్ కంచరపు రాజేష్, మార్కెట్ ప్రెసిడెంట్ కేశవరావు, ఉప్పు తయారీ దారులు, ఆమ్మకం దారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments