నరసన్నపేట:వికేంద్రీకరణ మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదిన నియోజకవర్గం కేంద్రమైన నరసన్నపేట పట్టణంలో ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు పోలాకి జెడ్పీటీసీ, యువ నాయకులు, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఈ ఉత్తరాంధ్ర గర్జన జరగనుంది. నరసన్నపేట గర్జన కోసం ఆదివారం పార్టీ నాయకులు , నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులతో వైసిపి కార్యాలయంలో వారు చర్చించారు. బుదవారం ఉదయం 10 గంటలకు నరసన్నపేట కాలేజీ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల విద్యార్థులు, ప్రజలు, రాజకీయ పార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ రాజధాని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
#darmanakrishnadas
#darmanakrishnaChaitanya
#ysrcp
#ycp
#uttarandragharjana
0 Comments