ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

52 షాపులకు తాత్కాలిక అనుమతులు.రెవెన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి


*52 షాపులకు తాత్కాలిక అనుమతులు*

*రెవెన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి*

శ్రీకాకుళం, అక్టోబర్ 22:- శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో 52 దీపావళీ పటాసుల షాపులకు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసినట్లు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలో 19, రూరల్ మండలంలో 2 , గార మండలంలో 3, నరసన్నపేట మండలంలో 5, పోలాకిలో 1, ఆమదాలవలసలో 3, బుర్జలో 1, ఎచ్చెర్లలో 14, లావేరులో 1, రణస్థలంలో 2, జలుమూరులో 1 చొప్పున అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ అనుమతులు అన్నీ తాత్కాలికమే అని పేర్కన్నారు. నిబంధనల మేరకు మాత్రమే మందుగుండు సామాగ్రి విక్రయించాలన్నారు. షాపుకి     
షాపుకి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలన్నారు. షాపు అవరణలో ధరల పట్టిక ఖచ్చితంగా ప్రదర్శించాలని సూచించారు. కరోనా నిబంధనలు తెలిపే బోర్డులు కూడా పెట్టాలని తెలిపారు. చిన్న పిల్లలు, మైనర్లతో షాపుల్లో వ్యాపారం చేయించవద్దు అని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ డివిజనల్ అధికారి, శాంతి హెచ్చరించారు.

Post a Comment

0 Comments