ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దక్షిణ కాశి శ్రీముఖలింగం లో మొదటి సోమవారం పోటెత్తిన భక్తులు.భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని ఈవో ప్రభాకరరావు

దక్షిణ కాశి శ్రీముఖలింగం లో మొదటి సోమవారం పోటెత్తిన భక్తులు

భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని ఈవో ప్రభాకర్ రావు

ఉదయం నాలుగు గంటల నుండి దర్శనాలకు అనుమతి గంటలకు భక్తులు ఇబ్బందులు

ఉచిత ప్రసాదాలు మంచినీళ్లు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి


సౌకర్యాలపై ఈవోని ప్రశ్నించగా ముఖం చాటేసాడు..   ...


శ్రీముఖలింగ క్షేత్రంలో ఎక్కడా కనిపించని పార్కింగ్ బోర్డులు

20 రూపాయల స్పెషల్ దర్శనం బోర్డులు


వీఐపీ, బ్రేకు దర్శనం జాడే లేదు.....

ఇప్పుడే ఇలా ఉంటే మూడో సోమవారం పరిస్థితి ఏంటి?

ఐదు జిల్లాల నుండి ఒరిస్సా రాష్ట్రాల నుండి పోటెత్తిన భక్తులు

వేలాది మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద్ చేసిన అయ్యప్ప స్వాములు తానే చేసామని చెప్పుకుంటున్న ఈవో ప్రభాకర్ రావు...

జలుమూరు:దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం జలుమూరు మండలము శ్రీముఖలింగం లోని శ్రీముఖ లింగేశ్వర స్వామి దర్శనానికి కార్తీక మొదటి సోమవారం యాత్రికులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి ముందు సోమవారం కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. శ్రీముఖలింగం క్షేత్రానికి వచ్చిన యాత్రికులు ఉచిత దర్శనాలకు, రూ.20 టిక్కెట్ల దర్శనాలకు వెళ్లేందుకు సరైన సూచిక బోర్డులు లేక చెప్పేవారు లేక యాత్రికులు నానా అవస్థలు పడ్డారు. నరసన్నపేట వైపు నుండి ఆటోలు బస్సులు ద్విచక్ర వాహనాలతో వెళ్లేవారు ఉచిత దర్శనాలు ఉన్నాయని తెలియక ముందుగా ఉన్న రూ.20 దర్శనాలకు వెళ్ళామని, చాలామంది పేద యాత్రికులు ఉచిత దర్శనాలు ఉన్నాయని తెలియక టిక్కెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళుతున్నామని వాపోతున్నారు. శ్రీముఖలింగేశ్వర నిదర్శనానికి వచ్చే యాత్రికులకు ఉచిత ప్రసాదం అందిస్తామని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటనలు గుప్పించినా.. అది క్షేత్రస్థాయిలో అమలకు నోచుకోలేదని, యాత్రికులెవరికీ ప్రసాదం ఇవ్వలేదని పలువురు యాత్రికులు ఆరోపించారు. ఉచిత దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులకు, రూ.20 దర్శనం క్యూ లైన్ లో ఉన్నవారికి ఒకే మాదిరిగా విడిచి పెట్టాల్సి ఉన్నప్పటికీ.. రూ.20 దర్శనం క్యూ లైన్ లో వెళుతున్న వారికి 20 మందికి విడిచిపెడితే ఉచిత దర్శనం క్యూలైన్లో ఉన్నవారికి ఒకరికి మాత్రమే విడిచిపెడుతున్నారని దీనివలన ఉచిత దర్శనం క్యూలైన్లో ఉన్నవారు గంటల కొలది నిరీక్షించాల్సి వస్తోందని యాత్రికులు వాపోతున్నారు. దర్శనానికి వచ్చిన యాత్రికుల్లో అత్యధిక శాతం నిరక్షరాస్యులు ఉన్నారని వారికి అర్థమయ్యేలా మైక్ లో చెప్పిస్తే సులువుగా తెలుస్తుందని పలువురు సూచిస్తున్నారు. శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి వచ్చిన యాత్రికులకు శ్రీముఖ లింగేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న మఠం వద్ద అయ్యప్ప భక్తులు అన్నప్రసాదం ఉచితంగా అందజేశారు. మండలంలోని కొమనాపల్లి శ్రీ సత్య సాయి భజన మండలి సభ్యులు సేవ అందించారు.

Post a Comment

0 Comments