పెద్దపాలెం చిన్నపాలెం గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం.
ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న సభాపతి.
మూడు సంవత్సరాల పాలన తరువాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చక్కని అవకాశం.
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారామ్
ఆముదాలవలస, సరుబుజ్జిలి అక్టోబర్ 19 :
ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు సంవత్సరాల తర్వాత ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి చక్కని అవకాశమని అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం గొప్ప సంతోషకరమన్నారు. గడిచిన ప్రభుత్వాలు మూడు సంవత్సరాల తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని ఆయన తెలియజేశారు. సరుబుజ్జిలి మండలం కొండవలస సచివాలయం పరిధిలోని పెద్దపాలెం, చిన్నపాలెం గ్రామాలలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలకు అందిన పథకాలను వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కార్యకర్త ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే వి జి సత్యనారాయణ,జెడ్పీటీసీ సూరవరపు నాగేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ లావేటి అనిల్ కుమార్, పి ఎ సి ఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ సర్దార్ గురువులు నాయుడు, మెండ సూర్యనారాయణ, బూత్ కమిటీ కన్వీనర్ ముడాడ్ల రమణ,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బద్రి రామారావు, మరియు వైఎస్సార్ పార్టీ సర్పంచులు,ఎంపీటీసీలునాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
0 Comments