స్మార్ట్ కెమ్ ఉద్యోగుల నూతన వేతన ఒప్పందం
ఎచ్చెర్ల:ఐక్యంగా వేతన ఒప్పందం సాధించిన స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్ ఉద్యోగులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు, జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అభినందనలు తెలిపారు. స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్ పరిశ్రమ వద్ద స్మార్ట్ కెమ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద గల స్మార్ట్ కెమ్ ఉద్యోగులకు స్మార్ట్ కెమ్ యాజమాన్యంకు సుదీర్ఘ చర్చలు అనంతరం వేతన ఒప్పందం జరిగిందని తెలిపారు. గత వేతన ఒప్పందం ముగియడంతో నూతన వేతన ఒప్పందం కొరకు స్మార్ట్ కెమ్ పరిశ్రమ యాజమాన్యంకు, సిఐటియు అనుబంధ స్మార్ట్ కెమ్ ఎంప్లాయిస్ యూనియన్ కు పలు దఫాలు చర్చలు జరిగి నూతన వేతన ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఉన్న వేతనంపై నెలకు రూ.8000 /- పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. అలవెన్సులు,ఎల్.టి.ఎ రూ. 2000/- పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. ఇన్సింటివ్ ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. ఎరియర్స్ పదిహేను రోజులలో చెల్లిస్తామని యాజమాన్యం తెలియజేసిందని తెలిపారు. ఈ సమావేశంలో స్మార్ట్ కెమ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.జనార్ధనరావు, పి.జగ్గారావు, యూనియన్ నాయకులు జి.భద్రరావు, బరాటం.తారకేశ్వరరావు, మంత్రి. కిషోర్ కుమార్, ఎన్.లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments