జిల్లాలో ఈనెల 21 నుండీ 31 వ తేదీ వరకు పోలీసు అమర వీరుల వారోత్సవాలు.
ఘనంగా నిర్వహించేందుకు సంసిద్దమైన ప్రకాశం జిల్లా పోలీసుశాఖ.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతీ ఏటా నిర్వహించే పోలీసు అమర వీరుల వారోత్సవాలు ఈనెల 21 నుండి అట్టహాసంగా ప్రారంభంకానున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను కొనియాడుతూ ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసుశాఖ సిద్ధమయ్యింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈనెల 21 వ తేదీ నుండీ 31 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల్ని గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల కీలకమైన పాత్ర, విధులు, త్యాగాలు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ తెలిపారు.*
0 Comments