ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి. స్పీకర్ తమ్మినేని సీతారాం

నియోజకవర్గంలో ప్రతి గడపకు స్వచ్ఛమైన త్రాగునీరు

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి

ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం

ఆమదాలవలస బూర్జ అక్టోబర్ 19 :
నియోజకవర్గంలో ప్రతి గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందించి అప్పుడు ప్రతి గడపకు వెళ్లి ఆశీర్వదించమని అడుగుతానని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం కొల్లివలస గ్రామంలో కస్తూరిబాయ్ గాంధీ బాలికల పాఠశాల లో మనబడి నాడు నేడు రెండో విడత కార్యక్రమంలో భాగంగా సుమారు 94 లక్షల నిధులతో నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. కంట్లం పంచాయతీ పరిధిలోని లచ్చయ్యపేట గ్రామంలో సుమారు 25.50 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి పథకానికి శంకుస్థాపన చేశారు అనంతరం వెంకంపేట గ్రామంలో సుమారు 42 లక్షల నిధులతో ఇంటింటికి మంచినీటి కొళాయి, 16 లక్షల నిధులతో డిజిటల్ లైబ్రరీ మరియు 51 లక్ష నిధులతో మనబడి నాడు నేడు రెండో విడత కార్యక్రమంలో భాగంగా నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో విద్యాలయాల రుపు రేఖలను సమూలంగా మారుస్తున్నారన్నారు. చదువు కోసం ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అమ్మబడి, గోరుముద్ద, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా విద్యను బలోపేతం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నెన దీప, జడ్పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఔట్సోర్సింగ్ డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు, పిఎసిఎస్ అధ్యక్షులు బగాధి నారాయణమూర్తి, డిసిఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, స్థానిక సర్పంచ్ మెట్ట అమ్మాజమ్మ, వైస్ సర్పంచ్ వెంకట్రావు వైయస్సార్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments