ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

25న సీఎం వైఎస్ జగన్ నరసన్నపేట రాక ?- రీ సర్వే రెండో విడతకు ఇక్కడ నుంచే శ్రీకారం- ధర్మాన కృష్ణదాస్ తో భేటీ అయిన కలెక్టర్ శ్రీకేష్ లాటకర్

శ్రీకాకుళం, నవంబర్ 12:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒకచోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్ఏ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ కేస్ బి లాటకర్ కు ప్రాథమిక సమాచారం చేరింది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో జిల్లా కలెక్టర్ లాఠకర్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభా నిర్వహణ ఏర్పాట్లు, హెలిపాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్ తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాధ్ తదితరులున్నారు.

Post a Comment

0 Comments