నరసన్నపేట: నవంబర్ 23వ తేదీన నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభను ప్రతి శిష్టకరణం కుటుంబీకులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని శిస్ట కరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నరసన్నపేటలో శిష్టకరణ కులస్తుల ప్రధాన నాయకులతో సమావేశం నిర్వహించారు. శిష్ట కరణ కులాన్ని బీసీ 'డీ'లో చేర్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిదేనని, అయితే శిష్టకరణం కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని, కనుక ప్రతి శిష్టకరణం జీవితాంతం వైయస్ కుటుంబానికి రుణపడి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రియతమ నాయకులు మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాసు గారి నాయకత్వంలో జరుగుతున్నఈ నెల 23వ తేదీన జరగనున్న సీఎం బహిరంగ సభ విజయవంతం చేసి ఆయన పేరు ప్రఖ్యాతలు పెంచేలా ప్రతి శిష్టకరణం కృషి చేయాలని సదాశివుని కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శిష్ట కరణం ప్రముఖులు ఎస్ ప్రభాకర్ రావు, డివి రఘు, వబి రామ్మోహనరావు , ఎం.వి.జె మోహన్ రావు అంపలాం వసంత్ కుమార్ , చౌదరి కాంతారావు, రఘుపాత్రుని వైకుంఠ రావు, సదాశివుని సింహాచలం ఉరికి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments