నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారంతో వందో రోజుకు చేరుకుంటున్నదని యువ నేత, పోలాకి జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు, మధ్యాహ్నం 3.30 గంటలకు జలుమూరు మండలం చల్లపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ హాజరవుతారని చెప్పారు. కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని యువనేత కృష్ణ చైతన్య కోరారు.
0 Comments