పోలాకి మండలం ఈదుల వలస ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఆవరణములో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఘనంగా నిర్వహించమని ప్రిన్సిపాల్ పి ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భోగి మంటలు,ముగ్గుల పోటీలు,పురాతన వస్తువులను ఎగ్జిబిషన్, మరియు పలు సంస్కృతి కార్యక్రమములు విద్యార్థులచే నిర్వహించామన్నారు. అలాగే విద్యార్థులచే హరిదాసు,కోయలు, గంగిరెద్దులవాళ్ళు, మట్టేవాళ్ళు మొదలగునవి పలువురు విద్యార్థులు వేశ ధారణ వేశారని తెలిపారు. మొత్తానికి సంక్రాంతి సంబరాలు ముందుగానే అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ బొజ్జ జగన్నాథం, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
0 Comments