జనవరి 14,శ్రీకాకుళం:రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఈ మకర సంక్రాంతి ప్రగతి తీసుకువచ్చిందని, మరోసారి కూడా జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ కోరారు. జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చమైన తెలుగు పండుగను అందరి ఇళ్లల్లో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కృష్ణదాస్ అభిలాషించారు.
0 Comments