ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

"వెలమ"లను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చాలని వినతి.

శ్రీకాకుళ నగరంలోని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసంలో ఆంధ్రప్రదేశ్ వెలుమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా "వెలమ"లకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆయనకు కోరారు. వెలమ సామాజిక భవనాలకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. "వెలమ"లను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చల్లా సింహాచలం,రాజేష్,వెంకట్రావు,రామారావు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments