శ్రీకాకుళం, జులై 12: ఈ నెల 21వ తేది నుండి ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే ప్రారంభం, ప్రతినెలా 3వ శుక్రవారం నాడు ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించ వలసిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే ను ఈ నెల 21 న నిర్వహించడం జరుగుతుందని. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగస్తులు వారి సమస్యలను తెలుపుకొనుటకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
0 Comments