ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వి.వి.ప్యాట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్

వి.వి.ప్యాట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్

శ్రీకాకుళం, జూలై 06 :- ఈవిఎం గోడౌన్ లో వున్న వి.వి.ప్యాట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ పరిశీలించారు.

గురువారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవిఎం గోడౌన్ లో వున్న వి.వి.ప్యాట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్, ఇంచార్జ్ డిఆర్ఓ మురళీకృష్ణ తో కలిసి పరిశీలించారు,

అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్ లోని ఈవిఎం గోడౌన్ లో వున్న వి.వి.ప్యాట్ లను మరియు స్ట్రాంగ్ రూమును ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పరిశీలించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు కూడ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి సెక్షన్ సూపరెంటెండెంట్ ప్రకాశ్, వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ ప్రతినిధి అందవరపు సూరిబాబు, టి. డి. పి పార్టీ ప్రతినిధి పి.ఎం.జె. బాబు, సి.పి.ఎం పార్టీ ప్రతినిధి గోవింద రావు, బి. ఎస్.పి.పార్టీ ప్రతినిధి బొకర నారాయణరావు, సి.పి.ఐ పార్టీ ప్రతినిధి చిక్కాల గోవింద రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments