*నారాయణపురం ఎడమ కాలువ ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు*
*కింతలి ఛానల్ పరిధిలో 1200 ఎకరాల్లో ఖరీఫ్ సాగు*
*ప్రతీ ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి*
*ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం*
ఆముదాలవలస,జులై 12:
ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం ఆయన నారాయణపురం ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ప్రాంతాలను పరిశీలించారు.కింతలి ఛానల్ పరిధిలో బెల్ మాం,లొద్దలపేట, తాడివలస,లచ్చయ్యపేట గండ్రేడు,బొడ్డేపల్లి, మొదలవలస,కింతలి ఆయా గ్రామాల రైతులు ఇటీవల సభాపతిని కలిశారు.తమ గ్రామాల పరిధిలో 1200 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందటం లేదన్నారు. దీనివలన సాగుకు అవాంతరాలు ఏర్పడుతున్నాయన్నారు. సాగునీరు సక్రమంగా లభ్యం కాకపోవటానికి గల వాస్తవిక పరిస్థితులను రైతులు, సభాపతికి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు బుధవారం ఉదయం ఆయా ప్రాంతాలను సభాపతి పరిశీలించారు. అనంతరం సభాపతి మాట్లాడారు.సుమారు 18,500 ఎకరాలకు నారాయణపురం ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతుందన్నారు.కావలి వారధి వద్ద,డైవర్షన్ ద్వారా కింతలి ఛానల్ కు సాగునీరు అందేలా అధికారులు డిజైన్ చేపట్టారన్నారు..కొన్ని సంవత్సరాలు కాలం నుండి ఇదే విధంగా,ఈ గ్రామాలకు సాగునీరు లభ్యం అవుతుందని వివరించారు. అయితే గత కొద్దికాలం క్రితం నీటి ప్రవాహం ఉధృతి పెంచే విధంగా మెయిన్ కెనాల్ పనులను ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేపట్టారన్నారు. కాలువ నీరు దిగువ ప్రాంతానికి విరివిగా ప్రవహించేలా నిర్మాణాలు చేపట్టారన్నారు.దీని వలన కింతలి ఛానల్ కు సాగునీరు అందే నీరు అప్ లిఫ్ట్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని స్పీకర్ గుర్తించారు.ఈ ఖరీఫ్ సీజన్లో ఈ 10 గ్రామాలకు నారాయణపురం ఎడమ కాలువ ద్వారా వచ్చే సాగునీరే ప్రధాన ఆధారం అన్నారు.ఈ పరిస్థితులలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సభాపతి ఇరిగేషన్ అధికారి సుధాకర్ కు ఆదేశించారు.ఇందు కోసం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సాగుకు అవసరమయ్యే విధంగా,ఎడమ ప్రధాన కాలువ నుండి,కింతలి ఛానల్ కు బైఫరికేట్ అయ్యే చోట నీటి నిల్వలు ఉంచేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఇందుకోసం తాత్కాలిక చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ పూర్తయిన వెంటనే కింతలి ఛానల్ కు సంపూర్ణంగా సాగునీరు అందేలా అవసరమయ్యే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను స్పీకర్ కోరారు. ఎంపీపీ కిల్లి నాగేశవరరావు,మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, తమ్మినేని వాసు, చింతడ ప్రసాద్,స్వామి నాయుడు,మండల మహిళా అధ్యక్షురాలు తమ్మినేని కృష్ణ కుమారి,పైడి పోలయ్య,లక్ష్మణా రావు, బెండి గాంధీ, కనుగుల కిషోర్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు
0 Comments