ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం
జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కార్యక్రమానికి శంకుస్థాపన
ఏపీ శాసనసభాపతి తమినేని సీతారాం
ఆముదాలవలస(పొందూరు) జూలై 6 :
రాష్ట్రవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజానీకం ముఖాల్లో చిరునవ్వులు చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.గురువారం పొందూరు మండలo పాపారాజు పేట, మల్లేష్ పేట మరియు తానేం గ్రామలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. తానేం గ్రామంలో సుమారు 53 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి పథకం కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి తప్పనిసరిగా పెన్షన్ వచ్చేలా పనిచేస్తున్న ఘనత వైసీపీ సర్కార్ కే దక్కుతుందన్నారు.గత ప్రభుత్వం హయాంలో ప్రతి నెల ఒకటో తేదీన మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే రోజులు ఉన్నాయా అని ప్రజలను స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు.అలాగే గత ప్రభుత్వంలో ఒక పింఛన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు రావాలన్న లంచం ఇస్తే గాని పని జరిగేది కాదని అలాంటిది వై యస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు, పించన్లు, రేషన్ కార్డు వంటివి పార్టీలకతీతంగా అందజేస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమలు ఆపకుండా యధావిధిగా కొనసాగిoచారన్నారు. అలాగే రైతు పండించే ధాన్యన్ని ప్రభుత్వమె స్వయంగా రైతులు దగ్గర కొనుగోలు చేస్తుoదన్నారు. ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేవిదంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అయన తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, పి ఎ సి ఎస్ అధ్యక్షులు కొంచాడ రమణ మూర్తి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బడాన సునీల్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కిళ్ళన సూర్యారావు,స్థానిక సర్పంచ్ పెద్దింటి రవి, కొండ వెంకటరమణ,తవిటిరెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు
0 Comments