*- రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు*
కిష్టప్పపేటలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నిర్వహించారు. లబ్ధిదారులతో మమేకం అయ్యారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు. తొలుత కార్యక్రమంలో భాగంగా 394 మందికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించారు.
శ్రీకూర్మం -4(తండ్యాలపేట) సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం లో 450 మందికి వివిధ ధృవీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.,
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 98 శాతం పూర్తి చేశాము. చెబితే చేసి తీరుతాం అన్నది జగన్ ప్రభుత్వం నినాదం. చెబితే చెయ్యం అన్నది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంకేతం. ఆ రోజు మహిళా సంఘాలకు చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్నారు. కానీ ఇవాళ ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూనే ప్రజల స్థితి గతులు పెంచేందుకు ఉపయోగిస్తున్నాం. సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తి లేకుండా చేశాము. నేరుగా మీ ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. దారిద్ర్యం,ఆకలి,కన్నీరు గమనించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీది.వాటిని తీర్చేందుకు చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోంది.
ఆ రోజు బ్రిటిష్ వారు సమగ్ర సర్వే చేశారు. మళ్ళీ ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత చేస్తున్నాం. ఉచితంగా చేస్తున్నాం. ఆధునిక సాంకేతికతను వినియోగించి అత్యంత పారదర్శకంగా నిర్వహించి సర్వే రాళ్లు సైతం పాతించి ఇస్తున్నాం. తద్వారా గ్రామాల్లో తగాదాలు లేకుండా చేస్తున్నాం. ఆర్బీకే,సచివాలయం,వెల్ నెస్ సెంటర్ ఇలా ప్రతిదీ ప్రజలకు చేరువ చేస్తున్నాం. పరిపాలను మరింత స్థానికం చేసేందుకే ఈ గ్రామ సచివాలయాలు. సమగ్ర అభివృద్ధి చూసి ఓర్వలేక విపక్ష శ్రేణులు చేసే ఆరోపణలు పట్టించుకోకండి. 4 ఏళ్లలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాం. వలంటీరు మీ ఇంటిలో పుట్టిన బిడ్డలా పౌరులకు సేవ చేస్తున్నారు. 1.65 లక్షలు కేటాయించి స్కూల్ లో డిజిటల్ క్లాస్ కి స్క్రీన్ ఏర్పాటు చేయించాం. నాడు నేడు పేరుతో పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చేశాం. మీ గ్రామంలో మీ ఇంటికే ఇవాళ అధికారులు వచ్చి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 11 రకాల సేవలు అందిస్తున్నారు. పాలనలో సంస్కరణలు చూడండి. వాటిని గమనించండి. మీ గ్రామం అభివృద్ధి చేసిన విధానం చూడండి. గతంతో బేరీజు వేసుకోండి. మరో ఆలోచనకు తావివ్వక మేలు చేసే ప్రభుత్వానికే మద్దతు ఇవ్వండి అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.
*జగనన్న సురక్షను వినియోగించుకోండి*
*జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు*
శ్రీకూర్మం - 4 గ్రామ సచివాలయ పరిధి (తండ్యాలపేట)లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 450 మందికి వివిధ ధ్రువ పత్రాలు అందజేశారు. లబ్ధిదారులతో మమేకం అయ్యారు. అలానే సంక్షేమ పథకాల వెనుక దాగి ఉన్న ప్రాథమిక ఉద్దేశాలను, వాటి నెరవేర్పునకు చేస్తున్న కృషినీ వివరించారు. ముఖ్యంగా వందేళ్ల తరువాత చేపడుతున్న సమగ్ర భూ సర్వే కారణంగా సత్ఫలితాలు వస్తున్నాయని, దేశంలోనే ఆదర్శ పాలన అన్నది ఆంధ్ర ప్రదేశ్ లో అందిస్తున్నామని అన్నారు.
భూమిపైన, భూ వివాదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం పెట్టినటువంటి శ్రద్ధ మరే ప్రభుత్వం పెట్టలేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఉదాహరణకు భూసర్వే విషయానికొస్తే.. గత ప్రభుత్వాలు సర్వే గురించి ఆలోచన చేసి మధ్యలోనే వివిధ కారణాలతో ఆగిపోయిన పరిస్థితి ఉంది. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక భూసర్వే శరవేగంగా జరుగుతోంది. భూమి వినియోగదారులకున్న సమస్యలు, కలతలు, హింస, అశాంతి వంటివన్నీ భూసర్వే ద్వారా మాత్రమే పరిష్కరించబడుతున్నాయి.
సమాజంలో తనకంటూ విలువైన ఆస్తిగల భూమిని కలిగి ఉన్నానని చెప్పుకునే హోదా తెచ్చుకోవడం మొదటిది. అంతేకాకుండా, తనకు అవసరమైనప్పుడు.. తన కుటుంబంలో ప్రయోజకులైనటువంటి వారు ఇతర రంగాల్లో అభివృద్ధిలోకొచ్చి స్థిరపడటానికి ఈ భూమి అవసరమైనప్పుడు ఉపయోగపడటం రెండోదిగా చెప్పుకోవాలి. పరిశ్రమలు స్థాపించుకోవడానికి, ఇతరత్రా వ్యాపారాల్ని పెట్టుకోవడానికి, వాటిని విస్తరించుకోవడానికి విలువైనటువంటి ఆస్తిని చూపెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి ప్రయోజనాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక దాగిఉన్నాయని అందరూ తెలుసుకోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఏంపిపిలు గోండు రఘురాం, అంబటి నిర్మల, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, బాన్నా నర్సింగ రావు, గుండ హరీష్, సర్పంచ్ గోరు అనిత, పీస గోపి, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, బరాటం నాగేశ్వర రావు, పిఎసియస్ అధ్యక్షులు గోండు కృష్ణ, అంధవరపు బాల కృష్ణ, మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 Comments