పోలాకి, జూలై 29; పోలాకి మండలంలో ప్రవహిస్తున్న వంశధార కాలువలో ముప్పిడి శాంతారావు అనే వ్యక్తి కాలుజారి పడిపోయి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పొలం పనుల నుంచి తిరిగి వస్తూ పోలాకి మండల కేంద్రానికి చెందిన శాంతారావు ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతవ్వడంతో రెవెన్యూ పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ ఆదేశాల మేరకు డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ప్రతినిధి ముద్దాడ బైరాగి నాయుడు, కనితి కృష్ణారావు, సత్తిబాబు, రెంటి కోట త్రినాధరావు తదితరులు సహాయక చర్యల వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎంతసేపటికి శాంతారావు ఆచూకీ దొరకకపోవడంతో సమాచారాన్ని కృష్ణదాస్ కు చేరవేశారు. విశాఖలోనే ఉన్న ఆయన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాల సహాయం కోరారు. జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. ఎన్టీఆర్ బృందాలు శనివారం రాత్రికి పోలాకి చేరుకునే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు
పొలాకి లో వంశధార కాలువలన్నీ పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్నాయి. సంఘటన దురదృష్టకరమని, బాధితు కుటుంబానికి ప్రభుత్వ తరపున ఆదుకుంటామని ఎమ్మెల్యే కృష్ణ దాస్ పేర్కొన్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.
0 Comments